టిఆర్పి మండల ఇంచార్జి మేనం సంతోష్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమయ పాలన పాటించని మండల వైద్యాధికారి, సిబ్బందిపై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల ఇంచార్జి మేనం సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆస్పత్రిని సందర్షించ్చినట్లుగా తెలిపారు. ఉదయం 11 గంటలైనా వైద్యాధికారితోపాటు సిబ్బంది సైతం విధులకు హాజరు కాలేదన్నారు.వైద్యం కోసం రోగులు ఉదయం 9 గంటల నుంచి నిరీక్షణ చేస్తున్నారని వాపోయారు.
వేలాది రూపాయలు ప్రజా సొమ్మును వేతనాలుగా పొందుతూ ప్రజలకు సకాలంలో వైద్యం అందించడం లేదన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు 24 గంటలు వైద్య సేవలు అందిస్తామని చెప్పడం తప్పా కనీసం 8 గంటలు కూడా వైద్యం అందడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదలకు 24 గంటలు వైద్యం అందేలా చూడాలని, లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
సమయపాలన పాటించని వైద్యాధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



