ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: జిల్లాలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్న ప్రయివేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య ,నారాయణ, నాగర్జున, రాక్ వర్డ్, కాకతీయ ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, లావుడియా రాజు కోరారు. గురువారం రోజున భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ కి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి పర్మిషన్ లేకుండా గత సంవత్సరం నుండి ఇప్పటివరకు అడ్మిషన్ తీసుకుంటున్న వలిగొండ భువనగిరి మోత్కూరు బీబీనగర్ మండలాల్లో శ్రీ చైతన్య ఈ విద్యా సంవత్సరం నుంచి భువనగిరిలో కాకతీయ, బీబీనగర్లో రాక్ వర్డ్, చౌటుప్పల్లో నారాయణ, రామన్నపేటలో నాగార్జున ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని, ఈ విద్యాసంస్థలకు ఎలాంటి పర్మిషన్ లేదు అడ్మిషన్ల కోసం బస్సులను తిప్పుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు పర్మిషన్ లేని విద్యాసంస్థలను గమనించగలరని, పర్మిషన్ లేని విద్యాసంస్థలు అడ్మిషన్ తీసుకొని మోసపోవద్దని ఇలాంటి విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకుంటే లక్షల్లో ఫీజు తీసుకోవడం జరుగుతుందని, ఈ విద్యాసంస్థల్లో సరైన తరగతులు లేక సరైన విద్యాబోధన లేక సరైన ఉపాధ్యాయ లేకుండా విద్యాసంస్థలు ఉంటాయనారు. ఈ విద్యాసంస్థల్లో సరైన ఆటస్థలాలు లేకుండా ఇరుక్కు గదుల్లో ఉంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు ఈ విద్యాసంస్థల్లో సరైన విద్యాబోధన లేకుండా ఇంటర్ టెన్త్ ఫెయిల్ అయిన వాళ్లతో టీచింగ్లు చెబుతూ తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉంటారు, ఇలాంటి విద్యాసంస్థల్లో చదువుకుంటే విద్యార్థి జీవితం నాశనం అవుతుంది, అడ్మిషన్ల కోసం రోడ్లమీద తిరిగే బస్సులను అడ్డుకుంటామని, కావున ఇలాంటి ప్రవేట్ విద్యాసంస్థలకు జిల్లా అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు భవాని శంకర్, వంశి లు పాల్గొన్నారు.
పర్మిషన్ లేని ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES