Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి 

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండలంలోని ఇసుక మాఫియ పైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు చింతపల్లి కిరణ్ గౌడ్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల అనుమతి పేరుతో ఇసుక మాఫియా పగలు రాత్రి తేడా లేకుండా జెసిబి, ట్రాక్టర్లతో ఇతర మండలాలకు అక్రమంగా ఇసుక రవాణా చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.

మాఫియానీ ప్రశ్నించి అడ్డుపడిన వారి పైన దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఇసుక మాఫియా చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇసుక మాఫియా వల్ల భూగర్భ జలాలు తగ్గి త్రాగునీటి సమస్య ఏర్పడుతుందని, ఈతా తాటి తాటి వనాలు ఎండిపోయి గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. గతం నుండి పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -