Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలి 

బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని, ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు డబ్బులు ఎత్తికెళ్ళినట్లు నా భర్త శివ చేసిన ఆరోపణలు అవాస్తవమని పట్టణానికి చెందిన  బారడ్ అంకిత అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఆరోపణలు చేయడంలో నిజం లేదన్నారు.నా తోడికోడళ్ళ సమక్షంలోనే తాను తల్లిగారి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. భర్త శివ కొట్టడంతో పాటు ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక యువకుని పై తన భర్త శివ తప్పుడు దరఖాస్తు చేయించి కేసు చేయించాడని చెప్పారు. ఆ యువకునితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.భర్త శివ నా గురించి వాకబు చేస్తూ వేధిస్తాడని,ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని ప్రతిసారి చెబుతాడన్నారు..నా భర్తకు సంబంధించిన బంగారం, వెండి,నగదు డబ్బులు లేవని అవన్నీ కల్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. తన భర్త శివ నాలుగు నెలల నుంచి ఉద్యోగం చేయడం లేదని అవాస్తవమని,, కేవలం రెండు నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు.

ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి ఉండడంతో తన తల్లికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకొని ఇంటి అద్దె చెల్లించడం జరిగిందన్నారు. తన బావ రమేష్ రాజకీయ అండతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు.ఒక యువకునితో నా భర్త ఫోన్లో మాట్లాడించి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.ఈ సమావేశంలో తండ్రి షికారి మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -