కొడారి వెంకటేష్: సామాజిక కార్యకర్త
నవతెలంగాణ – భువనగిరి: వికలాంగుల హక్కుల చట్టం -2016 కు భంగం కల్గించిన తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఉద్యోగి టి ఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ధరణికోట నర్సింహ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లు డిమాండ్ చేశారు. గురువారం వారు భువనగిరి లో మీడియాతో మాట్లాడుతూ.. జి. రేణుక అనే వికలాంగురాలు, తన చంటి పిల్లాడితో భువనగిరి నుండి ఉప్పల్ వెళ్ళడానికి జనగాం డిపో కు చెందిన ఆర్టీసీ బస్ నెంబర్ టిఎస్ సి 7 6864 ఎక్స్ ప్రెస్ బస్ ను గురువారం ఉదయం 7. 15 నిమిషాలకు భువనగిరిలో ఎక్కింది. ఈ క్రమంలో ఉప్పల్ వెళుతూ బస్ లో వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూర్చోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఆ సీట్లో ఇతరులు కూర్చున్నారు. రేణుక బస్ కండక్టర్ తో చెప్పి వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూర్చోవడానికి ప్రయత్నం చేసింది. కానీ కండక్టర్ ఎలాంటి స్పందన లేకుండా, వికలాంగురాలైన రేణుకకు సహకరించకుండా, ఆమెను అసభ్య పదజాలంతో దూషించి , సీటు ఉన్న బస్ లో రావాలని, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఎవరైనా కూర్చోవచ్చు అని, బస్ లో రాసినంత మాత్రాన అది అమలు జరిగదని వెటకారంగా మాట్లాడినట్లు తెలిపారు. దీంతో రేణుక ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ డిపో మేనేజర్, వరంగల్ రీజినల్ మేనేజర్ లు వెంటనే స్పందించి, కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని లేనిచో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
కండక్టర్ పై చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES