Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు డామేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి

రోడ్డు డామేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి

- Advertisement -

పైపాడ్ గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 

అడ్డదిడ్డంగా రోడ్డు పనులు నిర్వహించి రోడ్డు డ్యామేజీ కి కారణమైన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రాయచూర్ రోడ్డు నుండి వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధి లోని పైపాడు గ్రామం లోకి త్రాగునీటి పైప్ లైన్ వేసే క్రమంలో దారుణంగా రోడ్డు  డ్యామేజ్ అయ్యింది.  రెండు వాహనములు ఎదురెదురుగా వస్తె ఒక వాహనం బురదలో దిగపడే ప్రమాదం ఉందనీ గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపై ఉన్న బురద లో వాహనాలు, ప్రజలు కిందపడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కాళ్ళు, చేతులు విరిగితే బాధ్యుత ఎవరు కాంట్రాక్టర్ వహిస్తాడా, పై అధికారులు వహిస్తారా అని ప్రశ్నించారు. 

రోడ్డు విడితి ఎక్కువ ఉన్న పడమర వైపు పైప్ లైన్ వెయ్యకుండా రోడ్డు విడితి తక్కువ ఉన్న తూర్పు సైడు వెయ్యడం లో కాంట్రాక్టర్ ఉద్దేశం ఏమి అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  పైపాడు గ్రామ మాజీ సర్పంచ్ ఏ పరంజ్యోతి,  రైతు సంఘం నాయకులు ఎం జానకిరామ్ రెడ్డి, బి. మోహన్, బీజేపీ కౌన్సిల్ మెంబర్ బోయ వెంకటేశ్వర్లు, రైతులు C .లక్ష్మన్న. కుమ్మరి ఈరన్న ఏ నవీన్ మాజీ కౌన్సిలర్ , సి పరశురాముడు ,బోయ రాముడు,పెద్ద ఆనందం,కె శంకర్ సంజీవరాజు కురువ వెంకటేష్ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -