Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి 

గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి 

- Advertisement -

బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి 
జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి
నవతెలంగాణ – భూపాలపల్లి 
: జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి కోరారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ పి అశోక్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు  ఆన్లైన్లో బుక్ చేసినప్పటికీ సిలిండర్ డెలివరీ సమయంలో రవాణ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి అదనంగా రూ..100  వరకు అదనంగా వసూలు చేస్తూ, రిసిప్ట్ బిల్లు అడుగుతే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ల ను వినియోదారులకు అందుబాటులో ఉంచకుండా కమర్షియల్ సిలిండర్లకు బదులు ఇండ్లలో వాడే సిలిండర్లను హోటల్స్ బేకరీ షాపులలో నిల్వ ఉంచుతూ ప్రజలకు సకాలంలో అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులను గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేయాలని, నుండి  వారితో కుమ్మక్కైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని  కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ ,భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad