Tuesday, October 7, 2025
E-PAPER
Homeఖమ్మంమణుగూరు డిపో మేనేజర్ పై చర్య తీసుకోవాలి..

మణుగూరు డిపో మేనేజర్ పై చర్య తీసుకోవాలి..

- Advertisement -

డిపో ముందు జేఏసీనాయకులు ధర్నా..
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు డిపోలో టిమ్ రాని డ్రైవర్లను డిపో మేనేజర్ ఇబ్బందుల గురి చేస్తున్నారని, దాని కారణంగానే మణుగూరు డిపో డ్రైవర్ ఆర్ ఎం కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని నాయకులు తెలిపారు. డిపో మేనేజర్ గతంలో మహిళా కండక్టర్లను కూడా ఇబ్బందులకు గురి చేశారని  అన్నారు. మణుగూరు డిపో మేనేజర్ వేధింపుల కారణంగానే  సోమవారం ఖమ్మం ఆర్ ఎం ఆఫిస్ కు వెళ్లి అక్కడ మనోవేదనకు గురైన ఎస్.కె సైదులు సాహెబ్ ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దానికి నిరసనగా మణుగూరు డిపోలో జేఏసీగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలు చేసిన నాయకులు తాటి సుధాకర్ పి అచ్చారావు కె.వి.రామారావు సిహెచ్ లింగయ్య ఎస్సార్ బాబు, పి మధు ఆర్ఎన్ రావు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -