నవతెలంగాణ – ధర్మసాగర్
నాపై దౌర్జన్యం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ సీనియర్ నాయకురాలు బండి రత్తమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన గురువారం జరిగింది. వారి వివరాల ప్రకారం నేను గత 20 సంవత్సరాల నుండి సిపిఐ పార్టీలో పని చేస్తూ ఉన్న క్రమంలో పార్టీ వేసిన గుడిసెలలో నాకు ఒక ఫ్లాట్ ను కేటాయించడం జరిగిందని తెలిపారు. అందులో నేను బేస్ కట్టుకుందామని గురువారం మేస్త్రీలను, కూలీలను పిలిచి పనులు చేస్తుండగా, సిపిఐ సీనియర్ నాయకులైన బట్టు మల్లయ్య, సిపిఐ గ్రామ అధ్యక్షులు చిలుక బాబు నా ఫ్లాట్ మీదికి ధర్మసాగర్ గ్రామానికి చెందిన వల్లెపు వెంకటయ్య తండ్రి కొమరయ్యను పురమాయించి మాల కల్పిన నా పనులను ఆపమని, నానా బూతు మాటలు తిడుతూ పనులను నిలిపివేయడం జరిగిందని ఆరోపించారు.
అంతేకాకుండా నీకు దిక్కున చోట చెప్పుకో నీకు ఇక్కడ ప్లాట్ అనేది లేదని, ఒకవేళ నీకు ఫ్లాట్ ఉన్నదని అంటే చంపేందుకు వెనకాడబోమని బెదిరింపులకు గురి చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేస్తున్నటువంటి కూలీలను మేస్త్రీలను సైతం తమదైన శైలిలో వారు బెదిరింపులకు లోను చేసి అక్కడినుండి వారిని వెళ్లగొట్టడం జరిగిందన్నారు. గతంలో ఈ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ రకంనే నేను వేసుకున్న ఫ్లాట్ ను కూడా అమ్మాలనే పథకం ప్రకారం నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై హత్యాయత్నం చేసిన పై ముగ్గురిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాకు న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదు చేయడం జరిగింది.
దౌర్జన్యం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES