Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నకిలీ ధ్రువీకరణ పత్రంతో గెలిచిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి.

నకిలీ ధ్రువీకరణ పత్రంతో గెలిచిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు:

కాటారం మండలంలోని గుండ్రాతిపల్లి గ్రామ సర్పంచ్గా నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో గెలిసిన తోటపల్లి సావిత్రిపై వెంటనే చర్యలు చేపట్టి సర్పంచ్ పదవి నుంచి తొలగించాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.బుధవారం మండల కేంద్రంలో మాట్లాడారు సామాన్య ప్రజలకు,విద్యార్థులకు కుల, ఆదాయ,నివాస తదితర ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసిన పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది నకిలీ పత్రాలు ఎలా జారీ చేశారో ఉన్నతాధికారులు చెప్పాలని ప్రశ్నించారు.లాక్ కి మావద్ద ఉండదని చిలుక పలుకులు పలికే రెవెన్యూ యంత్రాగం,మీసేవ నిర్వాహకులు లంచాలు తీసుకొని నకీలి పత్రాల దందా నడపడం దుర్మార్గపు చర్యన్నారు.నకిలీ పత్రాన్ని అప్లోడ్ చెసిన,చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.గుండ్రాతిపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వేషన్ కేటాయిస్తే రెడ్డి (గాండ్ల) కులానికి చెందిన తోటపల్లి సావిత్రి, బీసీ కులానికి సంబంధించిన వారు కాకపోయినా,అక్రమంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రేగొండ మండలం నుండి పొందినట్లుగా నవ తెలంగాణతో పాటు పలు పత్రికల్లో చూసినట్టుగా తెలిపారు.తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరిపించి,బీసీ రిజర్వేషన్ స్థానంలో ఓసి (రెడ్డి గాండ్ల) కులానికి చెందిన వ్యక్తి అక్రమంగా పోటీ చేసి గెలిచినందున,తోటపల్లి సావిత్రి సర్పంచ్ పదవిని వెంటనే రద్దు చేసి, రెండవ స్థానంలో నిలిచిన గోనె ముకుందంను సర్పంచ్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -