Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇల్లు కూల్చిన గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

ఇల్లు కూల్చిన గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– బాధిత దంపతుల ఆవేదన
నవతెలంగాణ – కాటారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోతుల్వయి శివారు, సర్వే నెంబర్ 254లో నివసిస్తున్న పొట్ట పోచమ్మ – పోచం భార్యాభర్తలు గత 10 సంవత్సరాలుగా రేకుల షెడ్డులో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు.

రెండు రోజుల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం వీరు చుట్టాల ఇంటికి వెళ్లిన సమయంలో, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

ఇంటి ధ్వంసంతో ఇల్లులేని స్థితిలోకి వెళ్లిన పోచమ్మ–పోచం దంపతులు, తమకు జరిగిన అన్యాయంపై కన్నీటి పర్యంతమవుతూ న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఇంటిలో ఉన్న సామగ్రి నష్టపోయిందని, తమ జీవనాధారం పూర్తిగా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తక్షణమే పోలీస్ కేసు నమోదు చేసి, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత దంపతులకు ప్రభుత్వ పరంగా తక్షణ సహాయం, నివాస సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -