Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసిగాచి ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

సిగాచి ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

ప్రొఫెసర్‌ కోదండరాం
సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

నవతెలంగాణ-పటాన్‌చెరు
సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో సిగాచి పేలుడు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సైన్టిస్ట్‌ ఫర్‌ పీపుల్‌ (ఎస్‌ఎఫ్పీ), మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌), తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాలు పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ సంస్థల వైఫల్యముందని అన్నారు. సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాద సంఘటన బాధాకరం అని అన్నారు. దేశంలోనే రెండవ అతి పెద్ద ప్రమాద సంఘటనగా అభివర్ణించారు. సిగాచి బాధిత కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కలపాల బాబురావు, హైకోర్టు న్యాయవాది వసుధ నాగరాజ్‌, ఎంవీఎఫ్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌. వెంకటరెడ్డి, టీపీజేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ వై.అశోక్‌కుమార్‌, కో కన్వీనర్‌ కన్నెగంటి రవి, ఏపీసీఆర్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ ఉస్మాన్‌, మౌంట్‌ ఫోర్ట్‌ సోషల్‌ ఇన్సిట్యూట్‌ డైరెక్టర్‌ వర్గీస్‌, పర్యావరణ వేత్త డాక్టర్‌ నారాయణరావు, హెచ్‌ఆర్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్‌ ప్రసాద్‌, ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె. నరసింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెహమాన్‌, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షు లు శివ శంకర్‌ రావు, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం, సీపీఐ సీనియర్‌ నాయకులు ప్రకాష్‌ రావు, ట్రేడ్‌ యూనియన్‌ నాయ కులు గోవర్ధన్‌, యువ న్యాయవాది మెట్టు శ్రీధర్‌, ఏఐటీయూసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోయిని ప్రసాద్‌, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad