Tuesday, February 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిపిఓ, రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

జిపిఓ, రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

తహశీల్దార్ రవికుమార్ జిపిఓల వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు

మహబూబాద్ జిల్లాలోని గుడూరు మండల గ్రామ పాలన అధికారి షేక్ అబ్బాస్, రెవెన్యూ సిబ్బందిపై దాడులు చెసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిపిఓ మండల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తహశీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గుడూరు రెవెన్యూ శివారులోని సర్వే 407 ప్రభుత్వ భూమిలో గుర్తు కొందరు వ్యక్తులు మొరం పోసి చదును చేస్తున్నారనే సమాచారం మేరకు జనవరి 28న అపెందుకు జిపిఓ అబ్బాస్,రెవెన్యూ సిబ్బంది వెళ్లగా వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లుగా తెలిపారు. దాడికి పాల్పడిన వారికి గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని జిపిఓలు రాసురి శ్రీనివాస్,మేడిపల్లి రాజు,గొట్టం నరేశ్,సాదు సంపత్,మేడిపల్లి రాజేందర్,రాజు,స్వర్ణలత తోపాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -