ఎమ్మార్సీస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దార్ రవికుమార్ కు శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాండ్ర దినేష్ మాదిగ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దాడిని తీవ్రంగా ఖండిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన చేపట్టారు.దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి అవమానకరమనన్నారు.దాడికి పాల్పడిన వారిని,దాడి వెనుక ఉన్న ప్రేరేపకులను వెంటనే అరెస్టు చేసి చట్టబద్ధంగా కఠినమైన శిక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్ఏప్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు మాదిగ,అరుణ్,చరణ్,ఆది,రోజన్, రాజు పాల్గొన్నారు
జస్టిస్ గవాయిపై దాడికి పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలి.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES