- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సునీతకు బాధిత రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని వెంకట్ రాములు అనే వ్యక్తి పూర్తిగా ధ్వంసం చేసి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, 30 సంవత్సరాల నుండి ఉన్నదారిని అన్యాయంగా ధ్వంసం చేయడంపై తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -