Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్భూదాన్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

భూదాన్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా, బీబినగర్ మండలం, నెమర గోముల, గ్రామం లో సర్వే నెంబర్లు,219/11 219/12, 219/13,219/14, 219/15 219/16, 219/17,219/18 219/19,219/20, 219/21 219/22,219/23, 219/24 మరియు 219/25లోసుమారు ఎ॥ 115-00 భూదానం భూములు ఎన్ఫోర్స్మెంట్ డిపార్టెమెంట్ ద్వారా విచారణ , సోదాలు, జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకొని,న్యాయం చేయాలనీ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి బాధితులు,ఖాజా ఖుతుబొద్దిన్ సోమవారం గ్రీవెన్స్ లో దరఖాస్తు అంద జేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భూదానం భూములు ఆక్రమణకు, కబ్జాలకు గురి కాకుండా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భూదాన్ భూముల, విషయములో ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వారు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు జరిపి, అక్రమార్కులపై పలు కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. బాధితులు వెళ్లి అడుగుతే కబ్జా దారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరైతే భూదాన్ భూములు కబ్జాకు, పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకొని అమాయక ప్రజలను కాపాడాలని అన్నారు. సీపీఐ(ఎం) నాయకులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. భూదాన్ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే భూములు కొనుక్కు న్నారో, అమాయక ప్రజలను కాపాడాలని అక్ర మార్కులపై చర్యలు తీసుకో వాలని కలెక్టర్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, భూదాన్ భూములు కబ్జా చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -