ఆర్టీఐ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నాగర్ కర్నులు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడిచేసి, పసికందును చంపిన హంతకులను వెంటనే అరేస్ట్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కో కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులవివక్షకు గురైన చాకలి కుటుంబం, అగ్రకుల బలుపుకు, రెండు నెలల పసికందు ప్రాణాన్నీ బలిగొన్నారని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతుంటే కుమ్మెర గ్రామంలో దేవుని గుడిలోకి వస్తావా..మా దేవుని దర్శించుకుంటావా.. సాకలి దాన అంటూ దుర్భషలాడి, చిత్రహింసలు పెట్టి, రెండు నెలల పసి గుడ్డును కసాయి కాలుతో తన్నితే క్షణంలో అక్కడే ప్రాణం విడిచిన పసిబిడ్డ తనువు చాలించిందన్నారు. దాడికి పాల్పడ్డ దోషులను శిక్షించేదాకా వామపక్షాలు, బిసి, దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు ఏకం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
పసికందును చంపిన వారిపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



