Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరకళ్ళ సదరు కబ్జా చెసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

కరకళ్ళ సదరు కబ్జా చెసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

ప్రజావాణిలో తహశీల్దార్ కు రైతుల పిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్లలోని కరకళ్ళ సదరును కబ్జా చెసిన వారిపై చర్యలు తీసుకొని,సదను రక్షించాలని గ్రామ రైతులు,పశువుల కాపర్లు సోమవారం మండల తహశీల్దార్ రవికుమార్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు,కాపర్లు మాట్లాడారు. వందలాది ఏళ్ల నుంచి ఎర్రమట్టి బొందల కాడి నుంచి కాపురం అలుగు వాగు మీదుగా పారెస్ట్ వరకు కరకళ్ళ తోవ ఉందని తెలిపారు. ఈ తోవ నుంచి నిత్యం వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వందలాది  ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, వేలాది మంది కూలీలు, రైతులు, మేత మేయడానికి వెలల్లో పశువులు, కాపర్లు వెళుతుంటారని పేర్కొన్నారు. కొందరు సదరును కబ్జా చేయడంతో సబండ వర్ణం ఇబ్బందులకు గురివుతున్నట్లుగా వాపోయారు. తాము తహశీల్దార్ కు పిర్యాదు చెసిన నేపథ్యంలో బుధవారం ఆర్ఐ, సర్వేయర్ ను పంపించి సదరు సమస్యను పరిస్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా రైతులు నీలం ఐలయ్య, మొగులు సాహెబ్, మూడెత్తుల విజ్జన్న, కుసన సత్తయ్య, బాపు, కుమార్, షెరాలు, చంద్రమొగలి, సమ్మయ్యతోపాటు పలువురు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -