ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్: జిల్లాలో అనుమతులు లేని ప్రయివేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా పాఠశాలలు నడుస్తున్న కూడా విద్యాశాఖ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి పర్మిషన్ లేని పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజులు నియంత్రణ చట్టం లేకపోవడంతో విచ్చలవిడిగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజులు నియంత్రణ చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని లేనియెడల రానున్న రోజుల్లో పర్మిషన్ లేని పాఠశాలలపై దాడులు చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండెల్లి కళ్యాణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ, నాయకులు శ్రీధర్ రాబిన్సన్ సాయి తదితులు పాల్గొన్నారు.
అనుమతుల్లేని ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES