నవతెలంగాణ – దుబ్బాక
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ ఇచ్చిన టార్గెట్ ను చేరుకోవాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో వేలేటి భాస్కర శర్మ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. గురువారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్, ఐకేపీ, వ్యవసాయ, వైద్య, విద్య, పశుసంవర్ధక, పంచాయతీ, నీటిపారుదల శాఖల మండల స్థాయి అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఎంఈఓ జే.ప్రభుదాస్ తో కలిసి ఆయన మాట్లాడారు.
మండలానికి 396 ఇండ్లు మంజూరవగా.. 369 టార్గెట్ గా తీసుకోవడం జరిగిందని, ఇందులో 67 మంది లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, మిగిలిన లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలను చేపట్టేలా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేటి వరకు మండల వ్యాప్తంగా 60 వేల మొక్కల్ని నాటడం జరిగిందని, మరో 40 వేల మొక్కల్ని యుద్ధ ప్రాతిపదికన నాటుతూ వాటికి రక్షణగా కంచె లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రివ్యూ మీటింగ్ లో ఎంపీఓ నరేందర్ రెడ్డి, తిమ్మాపూర్, రామక్కపేట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్లు డా.ఉదయ్, డా.అదీబా, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES