నవతెలంగాణ – నకిరేకల్
వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటు ఉండి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. వైద్యులు సమయపాలన పాటించాలని, లేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందుబాటులో ఉండాలని, శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ను శుభ్రంగా ఉంచుకోవాలని, ఓపి ని తనిఖీ చేశారు. రికార్డులు, ఫార్మసీ, లేబర్ రూములు పరిశీలించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని భవనం పై కప్పు పెచ్చులు ఊడి ఉన్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. కొత్త భవన నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ డిఎంహెచ్ఓ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో యానాల అశోక్ రెడ్డి, తహసీల్దార్ బి. వరప్రసాద్, డాక్టర్ వాసవి, యుడిసి జగన్నాథ్ రెడ్డి, పిహెచ్ సి సిబ్బంది పాల్గొన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES