Tuesday, February 24, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎంపీడీఓ

విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి లు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వాహస్తే కఠిన చర్యలు తప్పావని మండల పరిషత్ అధికారి గంగాసాగర్ రెడ్డి అన్నారు. మంగళవారం కుభీర్ మండలంలోని బెల్గం తండా గ్రామ పంచాయతీ నీ పరిశీలించగా గ్రామ పంచాయతి లో ప్రతి రోజు మురికి కాలువలు సీసీ రోడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడలని తెలిపారు. అదేవిదంగా నర్సరీ లో మొక్కలను ప్రతి రోజు నీళ్లు పట్టేలా వాటిని కాపాడేలా చూడలన్నారు. దింతో పాటు గ్రామ పంచాయతి కి సంబదించిన పలు రికార్డులను పరిశీలించి అక్కడి నుంచి గ్రామమలో జరుగుతున్నా ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. గ్రామమలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ప్రతి కూలికి 100రోజులు పని కల్పించి వారి పనికి తగ్గట్టుగా కూలీలను వారం వారం అందేలా చూడలన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ గోకుల్, వసంత్ పంచాయతీ కార్యదర్శి ముజహిద్ ఖాన్ సిబ్బంది కూలీలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -