Wednesday, July 2, 2025
E-PAPER
Homeకరీంనగర్గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు…

గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు…

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
గ్రామాల్లో ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఉపేందర్ చారి బెల్ట్ షాప్ నిర్వాహకులను హెచ్చరించారు. మండలంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న  నిర్వాహకులకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై ఉపేందర్ చారి  కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిని ఎమ్మార్వో  ముందు బైండ్ డోర్ చేయడం జరుగుతుందన్నారు.అలాగే కఠినమైన చర్యలు తప్పవు అన్నారు. బెల్ట్ షాపులను నిబంధనలకు విరుద్ధంగా  నిర్వహించడం వల్ల గ్రామాలలో రోడ్డు ప్రమాదాలు, గొడవలు, కొట్లాటలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నాయి అన్నారు. వాటన్నిటిని దృష్టి ఉంచుకొని బెల్ట్ షాప్ నిర్వాహకులు బెల్ట్ షాపులను నిర్వహించకూడదని ఎస్సై హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -