Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయాజమాన్య తప్పిదం తేలితే చర్యలు

యాజమాన్య తప్పిదం తేలితే చర్యలు

- Advertisement -

– ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం
– కలెక్టర్‌తో కలిసి నోష్‌ ల్యాబ్‌ సందర్శన
నవతెలంగాణ-చిట్యాల

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామం పరిధిలో గల నోష్‌ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడిన ఘటనలో యాజమాన్యం తప్పిదం ఉంటే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. నోష్‌ ఫార్మా కంపెనీలో గురువారం రియాక్టర్‌లో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌తో కలిసి శుక్రవారం నోష్‌ ఫార్మా కంపెనీని సందర్శించారు. కంపెనీలో ప్రమాదం జరిగిన రెండో బ్లాక్‌ విభాగాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై కంపెనీ కార్మికులు, కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో కార్మికుల భద్రత కోసం చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. యాజమాన్యం కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని, ఘటనపై తక్షణమే పూర్తి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఎలాంటి సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా నోష్‌ ల్యాబ్‌లో కొద్దిరోజులుగా ఎలాంటి అనుమతులూ లేకుండా కంపెనీ విస్తరణ పనులు చేపడుతున్నారని, కెపాసిటీకి మించి ఉత్పత్తి జరుగుతోందని వెలిమినేడు బొంగునిచెరువు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కార్మికులకు సరైన భద్రత చర్యలు చేపట్టడం లేదని, కార్మిక చట్టాలను కాలరాసి యాజమాన్యం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే, కలెక్టర్‌ వెంట నల్లగొండ ఆర్డీవో అశోక్‌ రెడ్డి, చిట్యాల తహసీల్దార్‌ విజరు కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌్‌ పందిరి గీత తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -