Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ బకాయిలు చెల్లించకుంటే చర్యలు తప్పవు

ఆలయ బకాయిలు చెల్లించకుంటే చర్యలు తప్పవు

- Advertisement -

బకాయిదారులపై ఆర్ఆర్ యాక్టు నమోదు చేసి ఆస్తులను జప్తు చేస్తాం
బకాయిలు చెల్లించి ఆలయ అభివృద్ధికి దోహదపడాలి
స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న
నవతెలంగాణ – పాలకుర్తి

ఆలయ బకాయిలు చెల్లించకుంటే చర్యలు తప్పవని స్టేషన్ ఘన్పూర్ ఆర్డిఓ డిఎస్ వెంకన్న స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయంలో ఆలయ బకాయి ఉన్న టెండర్దారులతో ఆర్డిఓ డిఎస్ వెంకన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ  2008 నుండి టెండర్ల బకాయిదారులు ఆలయానికి డబ్బులు చెల్లించడం లేదని, బకాయిదారులు పది రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని, లేకుంటే ఆర్ఆర్ యాక్ట్ ( రెవెన్యూ రికవరీ యాక్ట్ ) ద్వారా బకాయి టెండర్ దారుల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను నిలుపుదల చేస్తామని తెలిపారు. ఈనెల 25న మరోసారి బకాయి టెండర్ దారులతో  సమావేశం నిర్వహిస్తామని  ఆర్డీవో తెలిపారు. టెండర్ బాకాదారులు డబ్బులు చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఆర్డీవో కోరారు. సమావేశంలో తాసిల్దార్ మంతాపురం శ్రీధర్, ఆలయ ఈవో భాగం  లక్ష్మీ ప్రసన్న, ఆలయ సూపర్డెంట్ కొత్తపల్లి వెంకటయ్య, టెండర్ బకాయి దారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -