– ఉన్నత విద్యామండలి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అవసరమైన అనుమతులు తీసుకోకుండా కొనసాగుతున్న ప్రయివేటు డిగ్రీ కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్, ఆదిత్య బిజినెస్ స్కూల్స్ పేరుతో బహుళ సంఖ్యలో హైదరాబాద్లో నెలకొల్పినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యా మండలి లేదా ఏదేనీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే బోధనా సిబ్బందిని నియమించుకుంటున్నదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజల నుంచి పలు వినతిపత్రాలు అందినట్టు పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్లో నడుపుకునేందుకు ఆదిత్య డిగ్రీ కాలేజెస్, ఆదిత్య బిజినెస్ స్కూల్స్ పేరుతో నడిపేందుకు మంజూరు లేదా అనుమతిని ప్రభుత్వం లేదా ఉన్నత విద్యా మండలి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అవసరమైన అనుమతులు లేకుండా ఏదైనా యాజమాన్యం, సొసైటీ, ట్రస్ట్ అనధికార ప్రయివేటు డిగ్రీ కాలేజీలను నడిపిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా తెలంగాణలో డిగ్రీ కాలేజీలను నెలకొల్పాలనుకుంటే వారు తప్పనిసరిగా ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీ నుంచి తప్పనిసరిగా అవసరమైన అనుమతులు పొందాలని సూచించారు. ఆయా కళాశాలల్లో చేరే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా డిగ్రీ కళాశాలలకు అనుమతి ఉందా? లేదా? అనేది తనిఖీ చేసుకోవాలని సూచించారు.
అనుమతి లేని డిగ్రీ కాలేజీలపై చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



