Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్సు పునరుద్ధరణకు చర్యలు 

బస్సు పునరుద్ధరణకు చర్యలు 

- Advertisement -

రహదారి డైవర్షన్ కు నిధులు – పనులు ప్రారంభించిన ఆర్మూర్ చిన్న బాలరాజ్ 
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని దుబ్బాక, రేకులపల్లి గ్రామాల మధ్య గల పురాతన బ్రీజ్ శిలవస్థకు చేరడంతో రేకులపల్లి మీదుగా బస్సు సౌకర్యం నిలిచి పోయింది. దింతో అయ్యాగ్రామాల ప్రజలు రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి, రోడ్డును డైవర్షన్ చేసే అవకాశం ఉండటంతో వాటికీ రూ..7లక్షలు నిధులు మంజూరు కాగా శుక్రవారం మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు పనులను ప్రారంభించారు. తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి కు అయ్యాగ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమములో దుబ్బాక సర్పంచ్ సరోజినీ దేవి, ఉపసర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి, రేకులపల్లి సర్పంచ్ రాజేందర్, ఆయా గ్రామాల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -