Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికారులు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు

అధికారులు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 
నవతెలంగాణ – వనపర్తి

జిల్లా విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వర్తించే పై స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో పీఎం పోషణ్, పీఎం శ్రీ పథకాల అమలు, సహా పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పథకాలను అమలు చేయడమే కాకుండా, వాటిని సంబంధిత పోర్టల్స్ లో అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం కూడా విద్యాశాఖ అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న పలు పథకాలు యూడైస్ పోర్టల్ లో డేటా ఎంట్రీ చేయని కారణంగా రాష్ట్రంలో జిల్లా వెనుకబడుతోందని కాబట్టి తప్పనిసరిగా ఎంఐఎస్ ఆపరేటర్ల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను డేటా ఎంట్రీ చేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వర్తించే పై స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమన్వయంతో పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మండల విద్యాధికారి నుంచి ఆపరేటర్ వరకు సమన్వయం చేసుకొని జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాల గణాంకాలను అప్డేట్ చేయాలన్నారు. జిల్లాలో ఇంటర్నెట్ కనెక్షన్ లేని పాఠశాలలకు వెంటనే ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయించి సంబంధిత పోర్టల్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. రాబోయే పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి గ్యాస్ సిలిండర్ ద్వారానే వంట చేయాలని, ఇందుకోసం అన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కలెక్టర్ నిధుల నుంచి ఇప్పించడం జరుగుతుందని తదుపరి సిలిండర్లను కొనసాగించేవిధంగా హెడ్మాస్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించడం జరిగిందని పది రోజుల్లో ఆ డేటాను కూడా పోర్టల్ లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో టాయిలెట్స్ లేని పాఠశాలలకు సంబంధించి తప్పుగా డేటా ఎంట్రీ నమోదు చేశారని, కొన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నప్పటికిని లేనట్లుగా నమోదు చేశారని, అలాంటి వాటిని తిరిగి డేటా సరి చేయాలన్నారు. ఇక పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన 15 పనులను త్వరగా చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఈఓ అబ్దుల్ ఘని, ఎంఈఓ లు, హెడ్మాస్టర్లు, ఏం ఐ ఎస్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -