Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీ సేవలో అక్రమాలకు పాల్పడితే చర్యలు 

మీ సేవలో అక్రమాలకు పాల్పడితే చర్యలు 

- Advertisement -

మండల గిర్ధవరి అంబిక 
నవతెలంగాణ – మిడ్జిల్ 

మీసేవ కేంద్రాలలో  ప్రభుత్వ నిబంధనాల ప్రకారం కులం, ఆదాయం, జననం, మరణం ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుండి నిబంధనల ప్రకారం రుసుము తీసుకోవాలని మండల గిర్ధవరి అంబిక అన్నారు. శుక్రవారం అంబిక మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే చట్టపరంగా చర్యలతో పాటు మీసేవ కేంద్రాలను రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అన్ని దరఖాస్తులకు ప్రభుత్వం నిర్ధార్ధించిన రుసుము తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని  కేంద్రాలలో దరఖాస్తు బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు తప్పులు రాకుండా చూసుకునే బాధ్యత  మీసేవ కేంద్రాలదేనని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -