Saturday, February 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు

అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి సారిక
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఎరువుల వ్యాపారులు రైతుల వద్ద అధికంగా వసూలు చేస్తున్నారని వ్యవసాయదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల అసలు ధర రూ.266 మాత్రమే ఉంది. అయితే ఇక్కడి వ్యాపారాలు రూ.350 నుంచి 370 వరకు అధికంగా వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయమై శనివారం రైతులు మండల వ్యవసాయ అధికారి సారికకు ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వెంటనే స్పందించిన అధికారి సారిక శనివారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణ దారులతో ఆమె మాట్లాడుతూ.. యూరియాను అధిక ధరలకు విక్రయించకూడదని హెచ్చరించారు. ముందుగా రైతులు  బుకింగ్ యాప్ ద్వారా  ఎరువులు బుక్ చేసుకుని, యూరియాను తీసుకువెళ్లాలని సూచించారు. అదేవిధంగా గత రెండు రోజుల కింద యూరియా అధిక ధరలకు విక్రయించడం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొని పరిశీలించగా అక్కడ నిజా నిర్ధారణలు తేలడంతో శ్రీరామ ఫెర్టిలైజర్ను దుకాణం లైసెన్సును రద్దు చేశామని తెలిపారు. అయితే ముందుగా బుక్ చేసుకున్న రైతుల కోసం ఎరువులను ఇచ్చేందుకే నేడు దుకాణం తెరిచి ఉంచారని, రేపటినుండి ఈ దుకాణాన్ని మూసివేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -