స్పెషల్ ఆఫీసర్ తనూజ
నవతెలంగాణ- దుబ్బాక : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మండల స్పెషల్ ఆఫీసర్, డీఎస్ఓ తనూజ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం దుబ్బాక మండలం రామక్కపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీడీవో వేలేటి భాస్కర శర్మ తో కలిసి ఆమె మొక్కల్ని నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కల్ని నాటడమే కాదు.. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.
మండలానికి నిర్దేశించిన 94,500 మొక్కల్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం రామకపేటలోని జెడ్పీ హెచ్ఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. వారి వెంట ఎంపీఓ నరేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ డా.ఉదయ్, రామక్కపేట పీహెచ్ సీ వైద్య సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES