Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చురుకుగా నామినేషన్ ప్రక్రియ

చురుకుగా నామినేషన్ ప్రక్రియ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు మున్సిపల్ కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ చురుకుగా ఆర్డీవో, ఆలేరు మున్సిపల్  ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి అన్నారు. ఆలేర్ పట్టణంలో గురువారం మున్సిపల్    కార్యాలయం వద్ద  ఎన్నికల అధికారులతో కలిసి విలేకరులతో మట్లాడారు. 1 వార్డు నుండి 3 వార్డు వరకు, 4 నుండి 6 వరకు,7 నుండి 9 వరకు, 10 నుండి 12 వరకు  మొత్తం 12 వార్డులకు అధికారులని నియమించామన్నారు.

 ఒక్కొక్క ఆర్వో మూడు వార్డులను పర్యవేక్షిస్తారన్నారు. వార్డువైస్ గా ఓటర్ లిస్టు సిద్ధంగా ఉందని, 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. క్యాండిడేట్స్ కు న్యూ బ్యాంక్ అకౌంట్ తీయమని చెప్పామన్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం అభ్యర్థులు తమ ఎన్నికల  ఖర్చుల్  ఉండాలన్నారు. క్యాస్ట్ , సర్టిఫికెట్లు ఐదు నుండి పది సంవత్సరాల క్రితం అయిన చెల్లుతాయని చెప్పారు. క్యాస్ట్ సర్టిఫికెట్ లేని వారు వెంటనే తీసుకోవచ్చని సూచించారు.

 కాండెడ్ తో పాటు మరో ఇద్దరికి మాత్రమే నామినేషన్ వేసేటప్పుడు అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థుల కొరకు హెల్ప్ డే పెట్టామన్నారు. అభ్యర్థులు ఇంటి పన్ను ఇతర టాక్స్లు బకాయి ఉండకూడదని పేర్కొన్నారు. బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ తో పాటు, ఎనీ బ్యాంకులో తీసుకోవచ్చని తెలిపారు. జీరో అకౌంట్ లోనే డబ్బులు వేసుకొని తమ ఖర్చులు చూసుకోవాలని  చెప్పారు.

 ఈ సమావేశంలో  మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల అధికారులు వి ఆంజనేయులు, సత్య ఆంజనేయ ప్రసాదు, దూడల వెంకటేష్, అనురాధ, హేమంత్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -