Sunday, January 4, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజాభిప్రాయ సేకరణలో నవతెలంగాణ చురుకైన పాత్ర

ప్రజాభిప్రాయ సేకరణలో నవతెలంగాణ చురుకైన పాత్ర

- Advertisement -

2026 నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణలో డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మేశ్వర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజాభిప్రాయాన్ని గ్రహించడంలో నవతెలంగాణ దినపత్రిక చురుకైన పాత్ర పోషిస్తుందని మండల డిప్యూటీ తహసీల్దార్ కె.బ్రహ్మేశ్వర్ రావు అన్నారు. శనివారం నవతెలంగాణ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన సమాజం కోసం, ప్రజా సమస్యల పరిస్కారం కోసం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకవచ్చే విధంగా తద్వారా పరిస్కారం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆదిశగా నవతెలంగాణ కృషి అభినందనీయమన్నారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తున్న నవతెలంగాణ పత్రికకు తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిపిఓ గొట్టం నరేశ్, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, ఆకుల శ్రీనివాస్, సబ్నిడి రమణారెడ్డి, బూడిద రాజసమ్మయ్య, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -