- Advertisement -
నవతెలంగాణ -పెద్దవంగర: కార్యకర్తలే పట్టుకొమ్మలని ఆపదలో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన సుంకరి సోమక్క (74) వృద్ధాప్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, చిలుక దేవేంద్ర తో కలిసి, సోమక్క భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట వార్డు సభ్యులు సుంకరి ఓంకార్, చిలుక సంపత్, చెరుకు యాకయ్య, నాయకులు రాములు, రమేష్, సాయి, ఏసయ్య, ఎల్లయ్య, సత్తయ్య, శేఖర్, కుమార్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



