Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కృతజ్ఞత సభకు తరలివెల్లిన ఉద్యమకారులు

కృతజ్ఞత సభకు తరలివెల్లిన ఉద్యమకారులు

- Advertisement -

హమీలు అమలు చేస్తామన్న ప్రకటన పట్ల కృతజ్ఞతలు 
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు 
నవతెలంగాణ – మల్హర్ రావు

తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్లు ఇస్తామని ఆరు గ్యారంటీల్లో పొందుపరచి వాటి అమలుకు ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన చేయడం పట్ల (టియూఎఫ్) తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మానిఫేస్టో కమిటీ చైర్మన్ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లకు కృతజ్ఞతగా కరీంనగర్ ఫిలీం భవన్ లో ఆదివారం నిర్వహించిన  కృతజ్ఞత సభకు మండల ఉద్యమ కారులు తరలి వెళ్తు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మాట్లాడారు.

ఈ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేసి ఉద్యమంలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని కోరారు. హమీ ఇచ్చి అమలుకు సిద్ధ పడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటన చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,వివేక్ వెంకటస్వామి, టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టియూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్, మల్హర్ రావు మండల అధ్యక్షులు బూడిద సతీష్, చొప్పరి రాజు, షేక్ చాంద్ పాష, ఆకుల సదానందం, దేవి భూమయ్య, కోండ్ర సారయ్య, జునగరి పద్మ. యాదండ్ల చిన్న గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -