Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఉద్యమకారులు..

రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఉద్యమకారులు..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: ఉత్తర తెలంగాణ కరీంనగర్ లోని రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కాటారం, భూపాలపల్లి డివిజన్ నాయకులు హాజరైయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడారు. జూన్ 02లోపు ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. కవులు కళాకారులతో కుల సంఘాల నాయకులతో అన్ని రాజకీయ పార్టీల మద్దతివ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపల్లి ప్రభాకర్, జిల్లా అధికారం ప్రతినిధి బోయిని రాజన్న యాదవ్, జేఏసీ కాటారం మండల అధ్యక్షులు కర్ణాకర్ రావు, మహాదేవపూర్ జేఏసీ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ,మహాముత్తారం మండల అధ్యక్షులు ఎండి ఇంతియాజ్, మండల అధ్యక్షులు బూడిద సతీష్, అంకరి ప్రభాకర్, అక్రమ్ బాయ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -