నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో ఎక్కడ ఏమి జరిగిన, ఎలాంటి వినూత్నమైన సాహసమైన క్షణ్ణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రపంచ హద్దలను దాటుతూ విస్త్రతంగా ప్రచారంలోకి వస్తుంది. ఓవైపు సృజన్మాతక వెలికి తీయడానికి సాధనంగా సోషల్ మీడియా ఉపయోగపడుతున్నా..మరోవైపు చెడు ప్రచారం కూడా అంతే స్థాయిలో ప్రచారం పొందుతుంది. చిన్న పెద్దా అన్న తేడాలేకుండా ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. రీల్స్, లైక్ మోజులో పడి యువతి, యువకులు పెట్రేగి పోతున్నారు. ఈక్రమంలో పలువురు ప్రాణాలు పొగొట్టుకున్న ఉదంతాలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియా పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది ‘ అని బాలీవుడ్ ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం ఆమె చేసిన వీడియో ఒకటి వైరలవుతుంది. అందులో సోషల్ మీడియా గురించి ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు యువతను ఆలోచింపచేసేలా ఉన్నాయి.
” నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్ మీడియా ట్రాప్‌లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్‌లకు వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్‌లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్‌లో వెతకొద్దు. ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్‌మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి. ” అంటూ ఐశ్వర్య వివరించారు.
దీంతో ఐశ్వర్యపై సోషల్ మీడియా వీక్షకులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యువతకు కావాల్సిన మెసేజ్‌ను అందించారంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు.