- Advertisement -
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ప్రశ్నలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి నటి మంచు లక్ష్మిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం విచారించారు. ఈడీ ఇచ్చిన నోటీసు మేరకు మంచు లక్ష్మి ఉదయం 10 గంటల ప్రాంతంలోనే దర్యాప్తు సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించటం ద్వారా ఆమె పొందిన ఆర్థిక లబ్ది గురించి ఈడీ అధికారులు నిశితంగా విచారించారు. ఈ డబ్బులను ఆమె హవాలా మార్గం ద్వారా పొందారా అనే కోణంలోనే విచారణ ఎక్కువగా సాగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా తన ఐదు సంవత్సరాల బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులకు మంచు లక్ష్మి సమర్పించారు.
- Advertisement -