Saturday, January 24, 2026
E-PAPER
Homeబీజినెస్అదానీ షేర్లకు లంచం కేసు కుదుపు

అదానీ షేర్లకు లంచం కేసు కుదుపు

- Advertisement -

– ఒత్తిడి పెంచిన యూఎస్‌ ఎస్‌ఈపీ
– షేర్లు 15 శాతం వరకు పతనం
– రూ.1.4 లక్షల కోట్లు ఫట్‌
ముంబయి :
అదానీ కంపెనీల షేర్లు తీవ్ర కుదుపునకు గురైయ్యాయి. అదానీ గ్రూప్‌ ఎదుర్కొంటున్న 265 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,200 కోట్లు) లంచం, మోసం కేసులో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) ఒత్తిడి పెంచడంతో వారాంతం సెషన్‌లో ఆ కంపెనీ షేర్లు దాదాపు 15 శాతం వరకు పతనమయ్యాయి. గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీలకు సమన్లు జారీ చేసేందుకు ఎస్‌ఈసీ కోర్టు అనుమతి కోరిన నేపథ్యంలో శుక్రవారం అదానీ గ్రూపులోని 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.4 లక్షల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయింది.
అదానీ గ్రూప్‌లోని అత్యంత కీలకమైన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ఏకంగా 10.76 శాతం పతనమై రూ.1,861కి పరిమితమయ్యింది. అదానీ గ్రీన్‌ షేర్‌ 14 శాతం నష్టంతో రూ.772 వద్ద ముగిసింది. ఈ సూచీ భారీ పతనాన్ని చవి చూసింది. అదానీ పోర్ట్స్‌ షేర్లు 7.5 శాతం తగ్గి రూ.1,307.60 వద నమోదయ్యాయి. అదానీ ఎనర్జీ 12 శాతం కోల్పోయి రూ.814.25కు పరిమితమయ్యింది. అదానీ గ్రూపులోని అంబుజా సిమెంట్‌, ఏసీసీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, ఎన్డీటీవీ తదితర అన్ని స్టాక్స్‌ గరిష్టంగా 5.98 శాతం వరకు పడిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -