ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన అద్దంకి రామలింగం ఉన్నతమైన విద్య చదివి గతంలో సాక్షర భారత్ మండల కన్వీనర్ గా పనిచేసిన సమయంలో రామలింగం మండలంలోని అధికారుల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామానికి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రావడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడంతో ప్రత్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి మాజీ వైస్ ఎంపీపీ శిర్గమల్ల నర్సింహాపై 909 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి మండలంలోనే మొదటి స్థానం దక్కించుకొని చర్చనీయంగా నిలిచారు. అద్దంకి రామలింగం గెలుపు కోసం చేపడుతున్న అభివృద్ధిలో కాంగ్రెస్ నాయకులు, యువకులతో పాటు గ్రామంలోని ప్రజలు పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వడంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
గ్రామ సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కొరటికల్ గ్రామాన్ని అభివృద్ధి లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తాను. కొరటికల్ గ్రామ ప్రజలు నాపై నమ్మకంతో మండలంలోని అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించినందుకు కొరటికల్ గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ సేవ చేస్తాను.



