- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ .సి ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య ఆవిష్కరించారు. సోమవారం ఐ డి ఓ సి ఆవరణలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అదనపు కలెక్టర్ రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్, జాతి పిత మహాత్మాగాంధీ చిత్ర పటాలకు పూల నివాళులు అర్పించిన స్నాంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



