నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా వాచ్ ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆటల పోటీలకు ముఖ్య అతిదిగా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి హాజరై, జెండా ఊపి ప్రారంభించారు. పురాతన కాలంలో, మహిళలు అన్ని ప్రాంతాలలో పాల్గొనడానికి సాధికారికత ఇవ్వలేదు.మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని కోరినారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అసోసియేటెడ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల పురోగతిని వేగవంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యూహాలు, వనరులు మరియు కార్యకలాపాలను గుర్తించి, వాటి అమలుకు మద్దతు ఇవ్వడం, మహిళలు సమాజంలో అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందాలని,వారి హక్కులను కాపాడాలన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, మహిళల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలన్నారు. నేటి ఆధునిక యుగంలో సాంకేతికత అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో, మహిళలు సాంకేతిక రంగంలో రాణించలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి , జిల్లా యువజన, క్రీడల అధికారి ధనంజనేయులు, టీఎన్జీవో ప్రెసిడెంట్ భరత్ , సెక్రటరీ ఖదీర్, వివిధ శాఖల జిల్లా మహిళా అధికారులు, జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ దశరథ్ రెడ్డి , పిడిఎస్ కార్యాలయ సిబ్బంది మురళి, జయ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.



