- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాటారం కేంద్రం లో గల కేజీబీవి పాఠశాలను గురువారం రోజున ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయు సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరును పరిశీలించి స్ట్రెంత్ పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుల ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో యం పీ డీ ఓ అడ్డురి బాబు, యం పీ ఓ వీరాస్వామి, ప్రిన్సిపాల్ చల్ల సునీత, పంచాయతీ సెక్రెటరీ షాగీర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -



