Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో లో భువనగిరి మండలం దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో కీలక మైన  కౌంటర్లు, సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, రిసెప్షన్ డెస్కులు, నియంత్రణ గదులు, భద్రతా చర్యలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అదనపు కలెక్టర్ సంబంధిత అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ  ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా  సమయపాలనతో పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ  కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కమీషనర్ రామలింగం  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -