Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె ప్రకృతి వనంలో పారిశుధ్య పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

పల్లె ప్రకృతి వనంలో పారిశుధ్య పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న పారిశుధ్య, శుభ్రత పనులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి మల్లిఖార్జున్ రెడ్డితో కలిసి అక్కడ నిర్వహిస్తున్న క్లీనింగ్ పనులను సమీక్షించారు.

గ్రామాల్లో రోజువారీగా నిర్వహించాల్సిన పారిశుధ్య కార్యక్రమాలు అన్ని గ్రామపంచాయతీలలో సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

అనంతరం గ్రామంలోని క్రిమేటోరియాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వీరస్వామి,సర్పంచ్ పంతకాని సడవలి, ఉప సర్పంచ్ కొండగొర్ల బాణయ్య  గ్రామపంచాయతీ కార్యదర్శి, , జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -