నవతెలంగాణ – గంగాధర : గంగాధర మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ అడిషనల్ డీసీపీ భీమ్ రావ్ తనిఖీ చేశారు. గంగాధర పోలీస్ స్టేషన్ భవనం ఏ సంవత్సరంలో నిర్మించారు, క్రైం వెహికిల్స్, ప్రమాదానికి గురైన వాహనాలు, స్టేషన్ లో అమలు చేస్తున్న 5 ఎస్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ పరిశీలించిన అడిషనల్ డీసీపీ పోలీస్ క్వార్టర్స్ ఉపయోగం, పోలీస్ స్టేషన్ కి నీరు, కరెంటు సరఫరా తీరుపై ఆరా తీశారు. సీసీటీవిల పనితీరు, మొక్కల పెంపకం, స్టేషన్ కి కేటాయించిన ప్రాపర్టీ వివరాలు, పోలీసు వాహనాల పని తీరు, వంటి అనేక అంశాలపై ఆరా తీసి వివరాలు తెలుకున్నారు. అడిషనల్ డీసీపీ తనిఖీ సమదర్భంగా గంగాధర ఎస్సై వంశీ క్రిష్ణ, ఆర్ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ మల్లేశం, భగవాన్ రెడ్డి పాల్గొన్నారు.
ఠాణాను తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES