- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ మనోహర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లో జరుగుతున్న పీఎన్ సీ, ఎన్ సీడి స్క్రీనింగ్ టెస్ట్ లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిల్ప, రవీందర్, సూర్య ప్రకాష్, సుశీల, సిబ్బంది ఉన్నారు.
- Advertisement -