మంత్రి శ్రీధర్ బాబుకు ప్రిన్స్ పాల్ వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదుల మంజూరు చేయాలని శనివారం రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు కళాశాల ప్రిన్స్ విజయదేవి, అధ్యాపక బృందం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా ప్రిన్స్ పాల్ తెలిపారు. ఇందుకు ప్రిన్స్ పాల్,అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పిఎసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, తహశీల్దార్ రవికుమార్, పిఏసిఎస్ డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు, రమేష్ పాల్గొన్నారు.
తాడిచేర్ల కళాశాలకు అదనపు గదులు మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES