నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్టాపన వేడుకలు సోమవారం నుండి శుక్రవారం వరకు కొనసాగుతాయి సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమాలను పరిశీలించారు.
ఉదయాన్నే భజన బృందాలు, మంగళ వాయిద్యాల నాదం మధ్య అమ్మవారి విగ్రహాన్ని అడేల్లి గ్రామం నుండి ఆలయనికి చెచ్చి ప్రత్యేక ఏర్పాటు చేసిన నీటిలో విగ్రహాలను జలనివాసం చేసారు . అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతల పూజలు, మహాగణపతి హోమం, జఠాధివాసం వంటి పవిత్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఆలయానికి వచ్చినభక్తులకు కోట్ల గ్రామానికి చెందిన పుండ్రు నారాయణ రెడ్డి అన్నదానం చేసారు. ఈ కార్యక్రంలో ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ్,ఈఓ భూమయ్య, ఆలయ కమిటీ సభ్యులు,పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ లు నారాయణ రెడ్డి,మాణిక్ రెడ్డి,నాయకులు వెంకట్ రామ్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, భోల్లోజి నర్సయ్య,దశరథ రాజేశ్వర్, మాధవ్ రావు,ఉట్ల రాజేశ్వర్ ,మారుతి, ఆలయ గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



