- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న బుధవారం పత్తి కొనుగోళ్ళు జరగవని పత్తి మార్కెట్ బంద్ ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్ ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కావున రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి పత్తిని మార్కెట్ కు తీసుకరావద్దని సూచించారు. రైతులు అందరు వ్యవసాయ మార్కెట్ కమిటికి సహకరించాలని కోరారు.
- Advertisement -



